కో ఆప్షన్‌ సభ్యుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-22T04:02:12+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక మంచి నాయకుడుని కోల్పోయిందని, ఎం.డి.నసీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

కో ఆప్షన్‌ సభ్యుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎండీ.నసీర్‌ మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి తదితరులు

కోస్గి, మార్చి 21 : టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక మంచి నాయకుడుని కోల్పోయిందని, ఎం.డి.నసీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కొడంగల్‌  ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. కోస్గి కోఆప్షన్‌ సభ్యు డు నసీర్‌ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం కోస్గి పట్టణానికి చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నసీర్‌ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మ్యాకల శిరీష, రాజేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, హరి, జడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, కో ఆప్షన్‌ సభ్యుడు ఓంప్రకాశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మ్యాకల రాజేశ్‌, హరి, సలీం, రామకృష్ణ, మునిసిపల్‌ కౌన్సిలర్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T04:02:12+05:30 IST