అన్నదాతకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-31T05:51:38+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు

అన్నదాతకు అండగా ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం 

అలంపూరు, డిసెంబరు  30 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నా రని, వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. మండలంలోని ర్యాలంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే అబ్రహాం ప్రారం భించారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రైతుల పక్షపాతి అని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌, వైస్‌ సర్పంచ్‌, వివిధ శాఖల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌ నాయకుడికి పరామర్శ

మునిసిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు కౌన్సిలర్‌ సరోజమ్మ భర్త, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవరాజు రెండు రోజుల క్రితం బైక్‌పై వెళ్తూ, ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అబ్రహాం గురువారం ఆయ న ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందించారు. 


నేడు ఎత్తిపోతల పథకాలపై సమావేశం

అలంపూర్‌ చౌరస్తా  : వివిధ ఎత్తిపోతల పథకాలపై వనపర్తి జిల్లా పెబ్బేరు పీజేపీ క్యాంపులో శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని ఇరిగేషన్‌ ఈఈ శ్రీనువాసులు ఎమ్మెల్యే అబ్రహాంను కోరారు. అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. వివిధ ఎత్తిపోతల పథకాలతో పాటు రాజోలిబండ డైవర్షన్‌ స్కీంపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు ఆయనకు తెలిపారు.

Updated Date - 2021-12-31T05:51:38+05:30 IST