మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎమ్మెల్యే ఆల

ABN , First Publish Date - 2021-02-09T03:32:30+05:30 IST

రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో కలిశారు.

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎమ్మెల్యే ఆల
మంత్రికి వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, ఫిబ్రవరి 8: రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజవర్గంలో ఉన్న పలు సమస్యలపై మంత్రికి వివరించారు. నియోజవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేయాలని, కొన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయడానికి నిధులు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Updated Date - 2021-02-09T03:32:30+05:30 IST