సీనియార్టీలో తప్పులను సవరించాలి
ABN , First Publish Date - 2021-12-27T04:08:08+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా సీనియా ర్టీలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ కోరారు.

గద్వాల టౌన్, డిసెంబరు 26 : ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా సీనియా ర్టీలో అనేక తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ కోరారు. బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా ఆదివారం డీఈవో కార్యాలయానికి వచ్చిన ఆదనపు కలెక్టర్ శ్రీహర్షకు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు. సీనియార్టీ జాబితాలోని తప్పులను సవరించిన అనంతరమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. బదిలీలు పూర్తి పారదర్శకంగా జరిగేలా కౌన్సెలింగ్ సెంటర్లలోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ శ్రీహర్ష, సీనియార్టీకి సంబంఽధించి నిర్ణయం తీసుకోవాల్సింది మహబూబ్‌నగర్ కలెక్టర్ అని, విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కోశాధికారి చక్రధర్, కార్యదర్శులు రమణ, హుసేని, తదితరులున్నారు.