నేడు మంత్రుల పర్యటన

ABN , First Publish Date - 2021-06-22T04:42:45+05:30 IST

భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌ గౌడ్‌ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటిం చనున్నారు.

నేడు మంత్రుల పర్యటన

 మహబూబ్‌నగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌ గౌడ్‌ మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటిం చనున్నారు. ఈ మేరకు అధికారిక కార్యక్రమాల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. ఉదయం 10:30 గంటలకు దివిటిపల్లిలో నిర్మితమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను, వాటర్‌ సప్లయ్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తారు. 11:30కు కొత్త కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12 గంటలకు పాల్కొండ క్రాస్‌ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన బైపాస్‌రోడ్డును ప్రారంభిస్తారు. పర్యటన అనంతరం మంత్రులు హైదరాబాద్‌ వెళ్తారు.

Updated Date - 2021-06-22T04:42:45+05:30 IST