కొవిడ్ రోగులను పరామర్శించని మంత్రి : బీజేపీ
ABN , First Publish Date - 2021-05-21T05:23:17+05:30 IST
జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి కొవిడ్ రోగులను పరామర్శించి ఉంటే ఇక్కడి వైద్యులు అందించే చికిత్స గురించి తెలిసేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వర్దన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నారాయణపేట టౌన్, మే 20 : జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి కొవిడ్ రోగులను పరామర్శించి ఉంటే ఇక్కడి వైద్యులు అందించే చికిత్స గురించి తెలిసేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వర్దన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ పక్క సీఎం నాణ్యమైన వైద్యం అందించాలని చెబుతుంటే జిల్లా ఆసుపత్రిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని, మంత్రి పది నిమిషాలు సమయం కేటాయిం చకపోవడం విడ్డూరమన్నారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందక రోగులు ప్రైవేటు ఆసుప త్రుల ను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించి రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్య లు తీసుకోవాలని ఆయన కోరారు. నారాయణపేట జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయాలని కోరారు.