మన్యంకొండ చరిత్రపై మంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
ABN , First Publish Date - 2021-10-30T03:45:08+05:30 IST
దక్షిణ తెలంగాణలోని ప్రసిద్ధ ఆల యం మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి, చ రిత్ర గురించి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీని వాస్‌గౌడ్ శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు.
దక్షిణాది రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, అక్టోబరు 29: దక్షిణ తెలంగాణలోని ప్రసిద్ధ ఆల యం మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి, చ రిత్ర గురించి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీని వాస్‌గౌడ్ శుక్రవారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మన్యంకొండ ఆలయ చరిత్రను వివరించారు. మన్యంకొండ ఆలయానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు వస్తుంటారన్నారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు కేటాయించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.