యోగాతో మానసిక పరిపక్వత: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-22T04:41:38+05:30 IST

యోగాతో మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించారు.

యోగాతో మానసిక పరిపక్వత: కలెక్టర్‌
యోగా చేస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు, అధికారులు

 మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌ ), జూన్‌ 21: యోగాతో మానసిక పరిపక్వత రావటమే కాకుండా శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయూష్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నామని తెలిపారు. పతంజలి కాలంనాటి యోగాను మనం పూర్తిగా మర్చి పోయమని, కానీ అనేక యురోపియన్‌ దేశాలు, పాశ్చాత్య దేశాలు అభ్యసిస్తున్నాయని చెప్పారు. యోగ వల్ల బుద్ది, పని చేసే సామర్థ్యం పెరుగుతుందన్నారు. యోగ ప్రాముఖ్యతను గుర్తించిన అనేక కార్పొరేట్‌ సంస్థలు దానిని తప్పనిసరి చేశాయని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్‌వో కె.స్వర్ణలత, యోగ గురువు ఆంజనేయులు, అరుణజ్యోతీ, డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ క్రిష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఏవో ప్రేమ్‌రాజ్‌, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.


అనాథ శరణాలయంలో..

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం): మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు యోగా ఎంత గానో దోహదం చేస్తుందని, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని డీఈవో ఉషారాణి అన్నారు. ఏనుగొండలోని రెడ్‌క్రాస్‌ అనాథ శరణాలయంలో సోమవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఆశశ్రమంలోని చిన్నారులు యోగా ఆసనాలతో ఆకట్టుకున్నారు. యోగా గురువు వనజారెడ్డిని శాలువాతో సత్కరిం చారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ వనజ, రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, జూనియర్‌ రెడ్‌క్రాస్‌ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్‌, రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


బాల భవన్‌లో..

మహబూబ్‌నగర్‌ టౌన్‌/పద్మావతి కాలనీ: యోగా నిత్య జీవితంలో భాగం కావాలని పాల మూరు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ లక్ష్మీకాంత్‌ రాఽథోడ్‌ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక బాల భవన్‌లో పంతంజలి యోగ సమితి నిర్వహించిన కార్యక్రమానికి వైస్‌ ఛాన్స్‌లర్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షుడు శివుడు, గంగాధర్‌, వెంకట్రాంరెడ్డి, దత్తురావు, సురేష్‌, శారద, దేవి పాల్గొన్నారు.


ఎంవీఎస్‌ కళాశాలలో

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ప్రపంచ యోగా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎంవీఎస్‌ డిగ్రీ, పీజీ కళాశాలల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, అధ్యాపకులు ఆసనాలు వేశారు. 


హయగ్రీవ స్వామి దేవాలయంలో

మహబూబ్‌నగర్‌: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ హయగ్రీవ స్వామి దేవాలయంలో అమ్మశ్రీ వరమంగ అకాడమీ ఆధ్వర్యంలో యోగా దినోత్స వాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్సై సాయినిర్మల, గద్వాల తహసీల్దార్‌ శ్రీనివాసజోషి, రిటైర్డ్‌ ఎంఎన్‌వో యతిరాజాచారి, హెడ్‌మాస్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ఉపాధ్యాయులు శుభాంగిని, అకాడమీ అధ్యక్షురాలు గోదా గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:41:38+05:30 IST