క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-12-26T05:42:18+05:30 IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 25 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. చెస్‌, అబాకాస్‌ పోటీలు విద్యార్థుల్లో మేధస్సును పెంచుతా యని చెప్పారు. శనివారం పట్టణంలోని శ్రేష్ఠ పాఠశాలలో శాంతానారాయణగౌడ్‌ జ్ఞాపకార్థం చెస్‌ పోటీలను నిర్వహిం చారు. ఈ పోటీలను మంత్రి ప్రారంభించి విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా చెస్‌ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిం చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు కౌన్సిలర్‌ ప్రవీణ్‌కుమార్‌, పాఠశాల నిర్వాహకులు రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

- అప్పన్నపల్లిలో కాశికాపుడే సమాజం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస కల్యాణ మండపాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. అదేవిధంగా అప్పన్న పల్లి నుంచి ఎదిర వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులను  మంత్రి పరిశీలించారు. 

Updated Date - 2021-12-26T05:42:18+05:30 IST