డిజిటల్‌ బోధనకు మంగళం

ABN , First Publish Date - 2021-12-29T05:10:48+05:30 IST

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సాంకేతికత అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన డిజిటల్‌ బోధన మూన్నాళ్ల ముచ్చటగానే మారింది.

డిజిటల్‌ బోధనకు మంగళం
వనపర్తిలో ఓ పాఠాశాలలో డిజిటల్‌ తరగతులను ప్రారంభిస్తున్న దృశ్యం

- 2015-16లో ప్రభుత్వ పాఠశాలలకు పరికరాలు

- 100 శాతం స్కూళ్లలో అమలు

- నెలల వ్యవ ధిలో తరగతుల బంద్‌

 వనపర్తి రూరల్‌, డిసెంబరు 28: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సాంకేతికత అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన డిజిటల్‌ బోధన మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో అనేక పాఠశాలల్లో డిజిటల్‌ బోధన అటకెక్కిందనే విమర్శలు వినిపి స్తున్నాయి. 2015-16 విద్యా సంవత్సరంలోనే వనపర్తి జిల్లాలో 54 పాఠశాలలకు డిజిటల్‌ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందుకోసం లక్షల నిధులను వినియోగించారు. విద్యా సంవత్సరం ముగిసేలోపే సగం పాఠశాలల్లో ప రికరాలు పాడయ్యాయి. 2017-18 విద్యా సంవత్సరంలో అధికారికంగా డిజిటల్‌ బోధన విధానాన్ని తప్పనిసరి చేశారు. గతంలో అందజేసిన కంప్యూటర్ల సామ ర్థ్యం తక్కువగా ఉండడంతో డిజిటల్‌ తరగతుల కోసం ఇచ్చిన మోడెం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో డిజిటల్‌ బోధన సాధ్యం కావడం లేదని ఉ పాధ్యాయులు పేర్కొంటున్నారు. డిజిటల్‌ తరగతులు బోధనలో  ఓ భాగం కావాలని రోజుకు తొమ్మిది పీరియడ్స్‌ ఉండగా అందులో ఒకటి విధిగా డిజిటల్‌ క్లాస్‌ ఉండాలనే నిబంధన ఉంది. ప్రతీ పాఠశాలలో ఒక్కో తరగతికి ఒక్కో క్లాస్‌  చొప్పున పాఠశాలలో ప్రతీరోజు తొమ్మిది క్లాస్‌లు డిజిటల్‌ బోధన కొనసాగాలి. సాధారణంగా ఆయా సబ్జెక్టుల్లోని ఒక్కో చాప్టర్‌ బోధనకు వారం పది రోజుల సమయం పడుతుండగా డిజిటల్‌ తరగతుల ద్వారా దానిని ఒకటి రెండు, పీరి యడ్స్‌లో పూర్తి చేయొచ్చు. డిజిటల్‌ తరగతుల ద్వారా అయితే బొమ్మలు, వీడి యోల రూపంలో బోధన ఉండడంతో విద్యార్థులు సులువుగా నేర్చుకునే వీలుం టుందని ఈ విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ విధానం దాదాపు అన్ని పాఠశాలల్లో కనిపించడం లేదు. గతంలో అందించిన డిజిటల్‌ పరికరాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి 2018లో డిజిటల్‌ తరగతులను తిరిగి ప్రా రంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతుల బోధనకు శ్రీకారం చుట్టారు. అయితే కొద్ది రోజులకే నిర్వహణ గాలికి వదిలేయడంతో నెల ల వ్యవధిలోనే తరగతులు బంద్‌ కావడంతో ప్రభుత్వ ఆశయాలకు తూట్లు ప డ్డాయి. ప్రతీ రోజు తరగతికి ఒకటి చొప్పున డిజిటల్‌ తరగతి బోధించాలి. పీరి యడ్స్‌ ఆధారంగా హెచ్‌ఎంలు సిబ్బందితో కలిసి ఈ మేరకు ప్రణాళికలు రూ పొందించాలి. రోజు వారికి డిజిటల్‌ తరగతులను రిజిస్టర్లలో నమోదు చేయాలి. కానీ చాలా చోట్ల ఈ పద్ధతికి మంగళం పాడినట్లు తెలుస్తోంది.  2018-19 సం వత్సరంలో 100 శాతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు డిజిటల్‌ పరికరాలు సరఫరా చేశారు. దీంతో అన్ని బడుల్లో డిజిటల్‌ తరగతులు ప్రారంభమయ్యా యి. అనంతరం కొద్ది రోజులకే పర్యవేక్షణ లేకపోవడంతో చాలా పాఠశాలల్లో ఉ పాధ్యాయులు పట్టించుకోలేదు. దీంతో ప్రొజెక్టర్‌, స్ర్కీన్‌ తదితర డిజిటల్‌ పరిక రాలు సైతం అటకెక్కాయి. రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పరికరాలు సంవత్సరం తిరక్కుండానే మూలకు చేరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

Updated Date - 2021-12-29T05:10:48+05:30 IST