వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-18T05:30:00+05:30 IST

క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య
జంగ పద్మ (ఫైల్‌)

ఆత్మకూరు, మే 18 : క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ముత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల జూరాల గ్రామానికి చెం దిన జంగ పద్మ (36), పెద్ద నరసింహులు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వీరికి గ్రామంలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేయగా, దిగుబడులు చేతికొచ్చాయి. గ్రా మంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాంట కూడా చేయించారు. అయితే, కాంట చేయించి పదిహేను రోజులు కావస్తున్నా, ధాన్యం తరలించకపోవడంతో వర్షానికి బస్తా లు తడుస్తున్నాయని సోమవారం సాయంత్రం అధికారులతో ప ద్మ వాగ్వివాదానికి దిగింది. దీంతో భర్త ఆమెను సముదాయించి ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ విషయంపై ఇంటి వద్ద కూడా గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన పద్మ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో గ్రామ బయటికి వెళ్లి, చెట్టుకు ఉరి వే సుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం గ్రామస్థులు చెట్టుకు వేలా డుతున్న పద్మ మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సంఘ టనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి త రలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-05-18T05:30:00+05:30 IST