మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-26T04:11:46+05:30 IST
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై వివాహి త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం అమరచింతలో చోటుచేసుకుంది.

అమరచింత, ఆగస్టు 25 : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై వివాహి త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం అమరచింతలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని 6వ వార్డు బీసీ కాలనీలో ఉంటున్న తోకలి సుజాత(28) భర్త రాజుతో కలిసి ఉపాధి నిమి త్తం హైదరాబాద్ వెళ్లింది. అక్కడ భార్యాభర్తలు గొడవపడటంతో రెండు రోజ ల కిందట రాజు తన ఇద్దరు కుమారులతో పాటు భార్యను అక్కడే విడిచిపెట్టి అమరచింతకు వచ్చినట్లు తెలిపారు. గత రాత్రి మృతురాలు ఒంటరిగానే అమర చింతకు వచ్చింది. ఈ సందర్భంగా మళ్లీ దంపతులు గొడవపడ్డారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.