ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-06T04:13:32+05:30 IST

మండల పరిధిలోని తిర్మలగిరి వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొ ని వ్యక్తి మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

వంగూరు, ఫిబ్రవరి 5: మండల పరిధిలోని తిర్మలగిరి వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన పోలే సళెయ్య (47) లూనాపై కల్వకుర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా మరికొద్ది సేపట్లో ఇంటికి చెరుకునే సమయంలోనే హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారిలోని తిర్మలగిరి వద్ద లూనాపై వెళుతున్న సళెయ్యను వెనకాల ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సళెయ్యకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్క డే మృతి చెందాడు. మృతుడికి భార్య కళమ్మ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. సంఘటన స్ఠలాన్ని పోలీస్‌లు పరిశీలించి బస్సును స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. 


Updated Date - 2021-02-06T04:13:32+05:30 IST