జయ జయహే మహిషాసురమర్దిని

ABN , First Publish Date - 2021-10-15T05:33:24+05:30 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం మహర్నవమిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

జయ జయహే మహిషాసురమర్దిని
జములమ్మ ఆలయంలో, గద్వాల కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహిషాసురమర్దినిగా అమ్మవారు, బీచుపల్లి సరస్వతీదేవి ఆలయంలో వీరలక్ష్మిగా అమ్మవారు

- భక్తి శ్రద్ధలతో మహర్నవమి వేడుకలు

- విభిన్న అలంకరణల్లో అమ్మవార్ల దర్శనం

గద్వాల టౌన్‌/ గద్వాల రూరల్‌/ ఇటిక్యాల/ అయిజ/ మానవ పాడు, అక్టోబరు 14 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం మహర్నవమిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని అన్నపూర్ణ, వాసవీ కన్యకాపరమేశ్వరి, శేరెల్లివీధి భీమలింగేశ్వర స్వామి, కాళికాదేవి ఆలయాల్లో అమ్మవారు మహి షాసురమర్దినిగా భక్తుల పూజలందుకున్నారు. భద్రకాళీ సమేత వీర భద్రస్వామి ఆలయంలో కూష్మాండదేవిగా, పాండురంగ శివాల యంలో కంచికామాక్షి దేవిగా, భక్తమార్కండేయ స్వామి ఆలయంలో మీనాక్షీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవార్లకు భక్తులు విశేష పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలో చివరి రోజు కావడంతో అన్ని ఆల యాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. 


- జములమ్మ అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ చైర్మన్‌ సతీష్‌ కుమార్‌, ఈవో వీరేశం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సం ఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు మేడికొండ జానకిరాములు, మాధవి కామ్లే, కుమ్మరి రాము, శంకర్‌, ఉద్యోగులు మురళీధర్‌ రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాష్‌, శివలింగం, సురేష్‌, మద్దిలేటి, నాగరాజు, రామకృష్ణ, పాండు పాల్గొన్నారు. 


- ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి జ్ఞానసరస్వతీ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవి వీరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు భువనచంద్ర ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, తిరువారాధన, కుంకుమార్చన, సామూహిక వ్రతాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు మేనేజరు సురేంద్రరాజు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 


- అయిజ పట్టణంలోని అంబాభవానీ ఆలయంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కట్టకింద వేంకటేశ్వరస్వామి గురు వారం హనుమత్‌ వాహనంపై ఊరేగారు. భక్తులు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. 


- మానవపాడు మండలంలోని చెన్నిపాడులో చెన్నకేశవ యూత్‌ ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం ముందు నిర్వహించిన ఈ పోటీల్లో దాదాపు 40 చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందించనున్నారు.

Updated Date - 2021-10-15T05:33:24+05:30 IST