మహనీయుడు వివేకానందుడు
ABN , First Publish Date - 2021-01-13T03:37:21+05:30 IST
భారతదేశ ఖ్యాతిని విదేశాలకు చాటిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతిని పాలమూరులో ఘనంగా నిర్వహించారు.

మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ కోయిలకొండ /భూత్పూర్/ రాజాపూర్/ దేవరకద్ర /జడ్చర్ల/నవాబ్‌పేట/మూసాపేట/మిడ్జిల్, జనవరి12: భారతదేశ ఖ్యాతిని విదేశాలకు చాటిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతిని పాలమూరులో ఘనంగా నిర్వహించారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకానందుడి విగ్రహానికి పూలమా లలు వేసి నివాళి అర్పించారు. వికాస్ పరిషత్ దక్షిణ ప్రాంతీయ కార్యదర్శి పాండురంగం సందేశం ఇచ్చారు. వివేకానందుడు యువతకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అని, ఆయన ఆశయాలు, ఆదర్శాలను నేటి తరం యువత పాటించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, భారత వికాస్ పరిషత్ అధ్యక్షుడు పి.రమేశ్‌చందర్ పాల్గొన్నారు.
- కోయిలకొండ మండల కేంద్రంలోని మంగళవా రం వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణయ్య ఆధ్వ ర్యంలో వివేకానంద చౌరస్తా దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
- యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండల కేంద్రంలోని చౌర స్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు అశో క్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నారాయణగౌడ్, స్వామి వివేకానంద యువజన సంఘం నాయకుడు నర్సిములు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మురళీ ధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సత్యనారాయణ, నర్సిములు గౌడ్ పాల్గొన్నారు.
- భూత్పూర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు వివేకానంద జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పోతులమడుగు గ్రామంలో వివేకానంద చిత్రపటానికి సర్పంచ్ కమలమ్మ పూల మాల వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమాల్లో పార్టీ కిషాన్ మోర్చా రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, దేవకద్ర నియోజవర్గ ఇన్ చార్జి రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవీందర్ పాల్గొ న్నారు. ఎంపీటీసీ ఊశన్న పాల్గొన్నారు.
- రాజాపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఈద్గాన్‌పల్లి, గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో మంగళవారం స్వామి వివేకానంద జయం తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకా నంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బచ్చిరెడ్డి, అలివేలు, మాజీ ఎంపీపీ నర్సిములు, అల్తాఫ్ పాల్గొన్నారు.
- దేవరకద్ర మండల కేంద్రంతోపాటు కౌకుంట్ల, పేరూర్, చిన్నరాజమూర్ గ్రామాల్లో మంగళవారం వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న విగ్రహాని కి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీ కొండా ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
- జడ్చర్ల పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మంగళవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, బాదేపల్లి మార్కెట్ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, బాదేపల్లి పీఏసీఎస్ అధ్య క్షుడు సుదర్శన్‌గౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బాద్మి రవిశంకర్, సీతారాంఝావర్, పిట్టల మురళి పాల్గొన్నారు.
- జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు శాంతికుమార్, వెంకట్రామ్‌రెడ్డిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏబీవీపీ నాయకులు రాజేష్, భరణి, భవానీ, అభి తదితరులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద, పోలేపల్లిలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన మన సేవా సమితికి స్వామి వివేకానంద బెస్ట్ సర్వీస్ అవార్డుకు ఎంపికైంది. నెల్లూరు జిల్లాకు చెందిన విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆన్‌లైన్‌లో అవార్డును మన సేవా సమితి అధ్యక్షుడు వడ్ల వేణుకు అందజేశారు.
- నవాబ్‌పేట, మరికల్, కొల్లూర్ తదితర గ్రామాల్లో స్వామి వివేకానందుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు నివాళి అర్పించారు. మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కొల్లి నర్సింహ ఆధ్వర్యంలో వివేకా నందుని జయంతి నిర్వహించారు. కొల్లూర్‌లో సర్పంచ్ సౌజన్య, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీలత, రఘు, చందర్ నాయక్, బాలకిష్టయ్యలు వివేకానం దునికి నివాళి అర్పించారు.
గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో వివేకానం దుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. మహమ్మదాబాద్, నంచర్ల, గాధిర్యాల్, వెన్నా చెడ్, గండీడ్, సల్కర్‌పెట్, రెడ్డిపల్లి, కప్లాపూర్, గోల్లగ డ్డ తదితర గ్రామాల్లో జయంతి వేడుకలు జరుపుకు న్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కమ తం రాజేందర్‌రెడ్డి, గిరమోని శ్రీనివాస్, శంకర్‌నాయక్, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కాంగ్రెస్ నాయకులు కేఎం. నారాయణ, ఇ.రాములు, నరింసిహారావ్, జితేం దర్‌రెడ్డి, సర్పంచ్‌లు లలితా చెన్నారెడ్డి, పుల్లారెడ్డి, అన సూయ, పార్వతమ్మ, వెంకట్‌రాంరెడ్డి, శిరీష, అరుణ జ్యోతి పాల్గొన్నారు.
- మూసాపేటతోపాటు వేముల, తిమ్మాపూర్ గ్రామాల్లో వివేకానంద జయంతిని వేడుకలను జరుపు కున్నారు. వివేకానంద విగ్రహాలకు పూల మాలాలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదమ్మ, అరుణ, కొండయ్య, శెట్టి శేఖర్, రెడ్డిరాజు, రఘుపతిరెడ్డి, సుమన్, పాల్గొన్నారు.
- యువతకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు అని జేపీఎన్‌సీఈ ప్రిన్సిపాల్ సుజీవన్‌కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు నిర్వహించారు.
మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు వల్లభురావుపల్లి లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి పాల్గొన్నారు.
