వర్గీకరణ కోసమే మాదిగ చైతన్య రథయాత్ర

ABN , First Publish Date - 2021-01-14T03:43:47+05:30 IST

వర్గీకరణ చేపట్టాలని మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ‘మాదిగ చైతన్య రథయాత్ర’ను చేపడుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.గోపాలకృష్ణ తెలిపారు.

వర్గీకరణ కోసమే మాదిగ చైతన్య రథయాత్ర

- మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.గోపాలకృష్ణ

పాలమూరు, జనవరి 13: వర్గీకరణ చేపట్టాలని మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ‘మాదిగ చైతన్య రథయాత్ర’ను చేపడుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 2నుంచి  మాదిగ చైతన్య రథయాత్రను ప్రారంభించి 33జిల్లాలో ప్రచారం చేపడుతామన్నారు. వర్గీకరణ చే యడంతో మాదిగ జనాభాకు దామాషాప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయటం సులువు అవుతుందన్నారు. మాదిగలు అందరు ఒక్కతాటిపైకి వచ్చి రథయాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బి.సురేష్‌, జి.దినే ష్‌, విజయరాజు, నరసింహులు, నరేందర్‌, రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T03:43:47+05:30 IST