జోరుగా జీరో దందా

ABN , First Publish Date - 2021-11-06T05:08:31+05:30 IST

అక్రమ వ్యాపా రానికి అడ్డుకట్ట వేయాల్సిన నిఘా వ్యవస్థ నిద్ర పోతుం డడంతో నారాయణపేట జిల్లా లో జీరో దందా జోరుగా సాగు తోంది.

జోరుగా జీరో దందా
తెల్లకాగితంపై రాసిన బిల్లు

తెల్లకాగితంపై బిల్లులు రాసిస్తున్న వ్యాపారులు

ప్రభుత్వ ఆదాయానికి గండి


నారాయణపేట టౌన్‌, నవంబరు 5: అక్రమ వ్యాపా రానికి అడ్డుకట్ట వేయాల్సిన నిఘా వ్యవస్థ నిద్ర పోతుం డడంతో నారాయణపేట జిల్లా లో జీరో దందా జోరుగా సాగు తోంది. పలువురు వ్యాపారులు లక్షల రూపాయల లావా దేవీలను సైతం తెల్ల కాగి తాలపై నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు. విషయం తెలిసినా సంబంధిత శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు మునిసిపల్‌ పట్టణాల్లో షాపింగ్‌ మాల్స్‌, దుస్తులు, బంగారు,  స్టీల్‌, సిమెంట్‌ దుకాణదారులు బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. వినియోగదారుడు అడిగితే తప్ప ఇవ్వడం లేదని, అడగకుంటే తెల్ల కాగితంపై రాసిస్తున్నారని సమాచారం. ఎవరైనా ఇదేంటని అడిగితే ఎస్టిమేట్‌ బిల్లు అంటూ బుకాయిస్తున్నారు. ఈ తెల్ల కాగితాలపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, టీఓటీ, వ్యాట్‌ రిజిస్టర్‌ నంబర్లు కనిపించవు. బిల్లులు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని కొనుగోలుదారులకు చెబుతుండటంతో వారు కూడా అడగడం లేదని తెలుస్తోంది.


హోల్‌సేల్‌ వ్యాపారం

జిల్లా కేంద్రంలో బంగారం, చీరల వ్యాపారం అధికంగా జరుగుతుంది. వందల సం ఖ్యలో దుకాణాలు ఉండగా, నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. దుకాణాల వద్ద సందడి జాతరను తలపించేలా ఉంటుంది. జిల్లాలో హోల్‌ సెల్‌, రిటైల్‌ దుకా ణలు నిర్వహించే వారు ఇక్కడి నుంచి సరుకులను దిగుమతి చేసుకుంటారు. బియ్యం, నూనే, చిరుధాన్యాల హోల్‌సెల్‌ వ్యాపారం కూడా జరుగుతోంది. వీటికి సంబంధించి బిల్లులు మాత్రమే దుకాణాల్లో ఇస్తుండగా, సరుకులు గోదాంల నుంచే సరఫరా చేస్తారు. ఇలా బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నకిలీ వస్తువులు అంటగడితే వినియోగదారులు దుకాణాల నిర్వాహకులను అడిగే అవకాశం ఉండదు.

Updated Date - 2021-11-06T05:08:31+05:30 IST