రెండో రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-14T04:44:22+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గురువారం రెండోరోజు లాక్‌డౌన్‌ కొనసాగింది.

రెండో రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌
పేటలోని ప్రధాన రోడ్డుపై వాహనాల రద్దీ

నారాయణపేట/ నారాయణపేట క్రైం/ ఊట్కూర్‌/ ధన్వాడ/ మాగ నూర్‌/ మరికల్‌/ మక్తల్‌/ మక్తల్‌ రూరల్‌/ , మే 13 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గురువారం రెండోరోజు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు లాక్‌డౌన్‌ మినహాయింపుతో దుకాణా లు తెరవగా జిల్లా కేంద్రంతో పాటు మక్తల్‌, కోస్గి మునిసిపాలిటీల్లో కొనుగోలు దారుల రద్దీతో ప్రధాన బజార్లలో జనాల సందడి కానవ చ్చింది. ముఖ్యంగా కిరాణ కొట్లు, పెట్రోల్‌ బంకుల్లో రద్దీ కానవచ్చింది. నారాయణపేట సరాఫ్‌ బజార్‌లో కూడా బంగారు దుకాణాల్లో కొనుగోలు దారుల సందడి కనిపించింది. ఆర్టీసీ బస్సులు పది గంటల్లోపే ఆయా ప్రాంతాలకు నడిపారు. పది గంటల నుంచి లాక్‌ డౌన్‌ అమలుతో దుకాణాలు మూత బడడంతో ప్రధాన రహదారులు బోసిపోయాయి.  నారాయణపేట మండలం జిలాల్‌పూర్‌ వద్ద కర్ణాటక రాష్ట్ర సరిహద్దును ఎస్పీ చేతన పరిశీలించారు. అనంతరం ఎస్పీ తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడతూ రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రార్థనలు కొద్ది మందితో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లాక్‌డౌన్‌ సమయం ముగిసే వరకు పూర్తి చేసుకోవాలన్నారు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ సైదయ్యలు లాక్‌ డౌన్‌ను పట్టణంలో పర్యవేక్షించారు. అంతర్రాష్ట్ర రహదారులు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ ఆంక్షల బోర్డులను పెట్టి అక్కడక్కడా తిరుగుతున్న వాహనాల కట్టడికి చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులో శానిటైజ్‌ చేశారు. ప్రయాణికులు మాస్కులు ధరించి బౌతిక దూరం పాటిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని డీఎం కోరారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని ఊట్కూర్‌లో ఎస్సై రవి, ధన్వాడలో ఎస్‌ఐ రాజేదర్‌ కోరారు. మాగనూర్‌ పరిధిలోని 167వ అంతర్రాష్ట్ర రహదారి నిర్మానుష్యంగా మారింది. ఎస్సై శివనాగేశ్వర్‌ నాయుడు, ఆరై నర్సిములు పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, సర్పంచ్‌ రాజు పర్యవేక్షించారు. మరికల్‌లో సీఐ శివకుమార్‌ పర్యవేక్షించారు. మక్తల్‌తోపాటు మండ లంలోని ఆయా గ్రామాల్లో రెండవ రోజు లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగింది. ఎస్సై ఏ.రాములు సిబ్బందితో కలిసి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. కోస్గి పట్టణంలోని మస్జిద్‌ల దగ్గరికి వెళ్లి ముస్లిం సోదరులు, మత పెద్దలతో ఎస్‌ఐ నరేందర్‌ మాట్లాడారు. రంజాన్‌ పండగ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-05-14T04:44:22+05:30 IST