7వ రోజు కొనసాగిన లాక్‌ డౌన్‌

ABN , First Publish Date - 2021-05-19T05:23:24+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏడవ రోజు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల లోపు సరుకులు పొందేందుకు మునిసిపల్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కిరాణ కొట్ల కు, కూరగాయలు, పండ్లు, పాలు కొనుగోలు చేసేందుకు జనాలు బారులు తీశారు.

7వ రోజు కొనసాగిన లాక్‌ డౌన్‌
వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు

నారాయణపేట, మే 18 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏడవ రోజు లాక్‌ డౌన్‌ కొనసాగింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల లోపు సరుకులు పొందేందుకు మునిసిపల్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కిరాణ కొట్ల కు, కూరగాయలు, పండ్లు, పాలు కొనుగోలు చేసేందుకు జనాలు బారులు తీశారు. పట్టణ రహదారుల్లో రద్దీ ఏర్పడింది. కూరగాయల మార్కెట్‌లో కూడా జనాల సందడి కానవ చ్చింది. నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ప్రధాన ప్రాంతాలకు పరిమిత బస్సులను ఉదయం 6గంటల నుంచి పది గంటల వరకు నడిపారు. జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు పర్య వేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నారాయణపేట మునిసిపాలిటీ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో మునిసిపల్‌ సిబ్బంది ప్రత్యేక కృషి చేస్తున్నారు. 



మాస్కులు ధరించి కొవిడ్‌ను తరిమికొట్టాలి

మక్తల్‌ : ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించి కొవిడ్‌ను తరిమికొట్టాలని ఎస్సై ఏ.రాములు అన్నారు. మంగళవారం 7వ రోజు మక్తల్‌ పట్టణంలో ఆల్‌మర్చెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు లాక్‌డౌన్‌ మినహాయింపు ఉన్నప్ప టికీ వ్యాపారులు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు దుకాణాలు తెరవలేదు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగింది. పోలీ సులు పట్టణంలో పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ప్రజలు అనవస రంగా రోడ్లపైకి రావద్దని ఎస్సై ఏ.రాములు అన్నారు. కార్యక్రమంలో కానిస్టే బుల్‌ అశోక్‌, రాజశేఖర్‌రెడ్డి, సత్యగిరియాదవ్‌, హుసేన్‌, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T05:23:24+05:30 IST