ప్రారంభానికే పరిమితమా?
ABN , First Publish Date - 2021-11-22T03:59:07+05:30 IST
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు కరువయ్యారు.

- కొనుగోలు కేంద్రాలలో ఒక్క బస్తా ధాన్యం తీసుకోని అధికారులు
- సింగిల్‌విండో, ఐకేపీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు
- వర్షం, తేమ వంటి కారణాలు చెబుతున్న అధికారులు
- ఎండిన ధాన్యం తడుస్తున్నదంటున్న అన్నదాతలు
- కేంద్రాల వద్ద ఇంకెన్ని రోజులు పడిగాపులు అంటున్న రైతులు
ఆత్మకూర్, నవంబరు 21 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనేవారు కరువయ్యారు. రాత్రింబవళ్లు రోజుల తరబడి ధాన్యం వద్ధ కాపలా కాసే దుస్థితి నెలకొన్నది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వా లు గిట్టుబాటు ధర ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు ధాన్యాన్ని కొనక పోవడంతో నిరాశ చెందుతున్నారు. చలి, వానలకు రాత్రి పగలు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగి ల్‌విండో పరిధిలో ఆత్మకూర్, అమ రచింత మండలాల్లో 11కొనుగోలు కేంద్రాలు, అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల్లో ఏడు కేం ద్రాలను ప్రారంభించారు. కానీ నేటికీ ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆరో పిస్తున్నారు. నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కార ణంగా ఈ ఖరీఫ్ కూడా అన్నదాతలకు నష్టానే మి గిల్చిందని రైతులు విలపిస్తున్నారు.
ఎందుకు కొనడం లేదు..
ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు బస్తా కొనుగోలు చేయకపోవడానికి తేమ, వర్షం ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నా అందులో నిజం లేదని రైతులు అంటున్నారు. అక్టోబర్ చివరి వారం నుంచి వరి కోతలు ప్రారంభం అయ్యాయి. వర్షాలు నవంబరు రెండోవారంలో ప్రా రంభం అయ్యాయని రైతులు అంటున్నారు. వర్షం ప్రారంభానికి ముందు నుంచే కొనుగో లు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చాం. అప్పటికే ఆయా గ్రా మాలలో అధికారులు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు. అధికారులు, నా యకులు నిర్లక్ష్యం చేస్తూ వర్షం సాకు చూపిస్తున్నా రని అన్నదాతలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆరబెట్టుకున్న ధాన్యం వర్షానికి మొలకెత్తుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక రాకు నాలుగు క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ప్రస్తుతం ధాన్యం తడవకుండా అద్దెకు టార్పాలీన్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా యి. అద్దె పెరిగి మరింత భారం రైతుపై పడుతుం దని అంటున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదు కోవాలని డిమాండ్ చేస్తున్నారు.

