సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , First Publish Date - 2021-05-06T05:04:20+05:30 IST

మండల పరిధిలోని చారకొండ సర్పం చ్‌, ఉప సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ గత వారం వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

చారకొండ, మే 5: మండల పరిధిలోని చారకొండ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ గత వారం వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి గ్రామానికి చేరుకొని సర్పంచ్‌ దీక్షను విరమింపజేశారు. అనంతరం ఉన్నతాధికారు లు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సస్పెషన్‌ ఎత్తివేసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం సస్పెషన్‌ ఎత్తివేసినట్లు వారు తెలిపారు. Updated Date - 2021-05-06T05:04:20+05:30 IST