పాలకులకు గుణపాఠం నేర్పుదాం

ABN , First Publish Date - 2021-12-27T04:07:15+05:30 IST

ప్రజల మధ్య విద్వే షాలు పెంచి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్ర యత్నిస్తున్న పాలకులకు గుణపాఠం నేర్పేందుకు పార్టీ శ్రేణులు సమాయాత్తం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు పిలుపునిచ్చారు.

పాలకులకు గుణపాఠం నేర్పుదాం
పార్టీ జెండాను ఎగురవేస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు

- సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు  

- ఘనంగా పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవం 

గద్వాల టౌన్‌, డిసెంబరు 26 : ప్రజల మధ్య విద్వే షాలు పెంచి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్ర యత్నిస్తున్న పాలకులకు గుణపాఠం నేర్పేందుకు పార్టీ శ్రేణులు సమాయాత్తం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు  పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం పోరాటం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతర ప్రజాపోరాటాలు సా గించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ  సొంతమ న్నారు. పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్క రించుకొని ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాల యం వద్ద జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ  75ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ప్రజలు కూడు, గూడు, నీడ కోసం పరితపించే పరిస్థితులు ఉండగా, మతాలు, మందిరాలు, కులాల పేరుతో పాలకులు రాజకీయా లు సాగిస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు సంపన్నుల కు ఊడిగం చేస్తుండటం దుర్మార్గమన్నారు. ప్రజల మద్దతు కోసం ఉద్వేగాలపై ఆధారపడుతున్న నేటి పాలకులకు కనువిప్పు కలిగించేందుకు సీసీఐ నిరం తర పోరాట బాటను ఎంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కే. గోపాల్‌రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసిం హులు, నాయకులు కృష్ణ, సత్యరాజు, చెన్నయ్య, జ మ్మన్న, లక్ష్మన్న, వివిధ యూనియన్ల నాయకులు వెంకటేష్‌, సూరిబాబు, తిమ్మన్న, రామన్న, తదితరులున్నారు. 

Updated Date - 2021-12-27T04:07:15+05:30 IST