జిల్లా చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం
ABN , First Publish Date - 2021-11-22T04:51:38+05:30 IST
రాష్ట్ర సాధన అనంతరం జరిగిన జిల్లాల పునర్‌విభజనలో జోగు ళాంబ గద్వాల జిల్లాగా స్థానం దక్కించుకున్న నడిగడ్డ ప్రాంతపు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా

గద్వాల టౌన్, నవంబరు 21 : రాష్ట్ర సాధన అనంతరం జరిగిన జిల్లాల పునర్‌విభజనలో జోగు ళాంబ గద్వాల జిల్లాగా స్థానం దక్కించుకున్న నడిగడ్డ ప్రాంతపు చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తమ ఆలోచన శక్తికి పదును పెట్టాలని తెలంగాణ సా రస్వత పరిషత్ కోర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు మోహ న్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ సారస్వత పరిష త్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన సాహిత్య, సాంస్కృతిక వారోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతీఒక్కరం నిబద్ధతతో కృషి చేద్దామని అభ్యర్థించారు. ఆదివారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పరిషత్ జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించా రు. జిల్లాకు సంబంధించిన నైసర్గిక స్వరూపం, భౌ గోళిక సరిహద్దులు, జిల్లా ప్రాచీన ఆధునిక చరిత్ర, సంస్కృతి, పురావస్తున కట్టడాలు, కళావికాసం, పద్య, గేయ, వచన కవిత, జానపద కళల గురించి సమగ్ర సమాచారాన్ని వ్యాసాల రూపంలో అందజేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన తుది గడువును త్వరలోనే తెలియజేస్తామన్నారు. ప్రతీ జిల్లాలో ఒక చోట సాంస్కృతిక వారోత్సవాన్ని నిర్వహించేందు కు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని సమావేశానికి హా జరైన కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు వివ రించారు. ఉత్సవ నిర్వహణ కోసం ఏర్పాటైన కోర్ కమిటీలో సభ్యులుగా నియమితులైన రామ్మోహన్ రావు, బైరోజు రాజశేఖర్, జయన్న నాయుడు, బోర వెల్లి పవన్‌కుమార్, మంగళగిరి శ్రీనివాసులును వారి కి పరిచయం చేశారు. ఇలాంటి సమావేశాలను అ లంపూరు, అయిజ, పట్టణాల్లోనూ నిర్వహించాలని ని ర్ణయించారు. సమావేశంలో రిటైర్ట్ డీఎస్పీ పూజారి కృష్ణమూర్తి, శంకర్, కిశోర్, వేణు, ప్రభాకర్, కలిముల్లా పాల్గొన్నారు.