ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

ABN , First Publish Date - 2021-12-27T03:41:17+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్‌ అన్నా రు.

ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
పాన్‌గల్‌లో మాట్లాడుతున్న శ్రీరామ్‌

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ 

- ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

- పాన్‌గల్‌, అమరచింతలలో జెండావిష్కరణలు


పాన్‌గల్‌, డిసెంబరు 26 : కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్‌ అన్నా రు. ఆదివారం సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో పార్టీ జెం డాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన లక్ష రూ పాయల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం, 57 ఏళ్ల వృద్ధులకు పింఛన్‌ హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేయ కపోవడంతో పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పం డించిన ప్రతీ దాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో సీపీఐ నాయకులు గోపాల్‌, హనుమంతు, కురుమన్న, బాలస్వామి, హుస్సేన్‌, సహదేవుడు, రాముడు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. 


 పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..

అమరచింత : భారత కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం అమరచింతలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో సీపీఐ జెండా కట్టా వద్ద పార్టీ మండల కార్యదర్శి అబ్రహాం ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. ఈ సంద ర్భంగా అబ్రహాం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం కమ్యూనిస్టు పార్టీ వీరోచితంగా పోరాటం చేసిన చరిత్ర ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసి లక్ష లాది ఎకరాలు భూపంపిణీ చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందని కొనియాడారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలందరూ పనిచేయాలని కోరారు. కార్యక్ర మంలో సీపీఐ నాయకులు లక్ష్మీనారాయణశెట్టి, పట్టణ కార్యదర్శి భాస్కర్‌, కుతూబ్‌, పెంటన్న, దేవరాజ్‌, ఎర్రన్న, వెంకటయ్య తదితరులు పాల్గొ న్నారు.   




Updated Date - 2021-12-27T03:41:17+05:30 IST