ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

ABN , First Publish Date - 2021-12-26T05:24:40+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించి పోరా డాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్‌ పిలుపునిచ్చారు.

ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్‌


పాన్‌గల్‌, డిసెంబరు 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించి పోరా డాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్‌ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని తెల్లరాళ్లపల్లి తండాలో నిర్వహించిన సీపీఎం జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేవరకు పార్టీ శ్రేణులు ఉద్యమించా లన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు పోరాడాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్య నాయక్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దేవేందర్‌, సీపీఎం నాయకులు బాబునాయక్‌, సోమ్లానాయక్‌, రాజునాయక్‌, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:24:40+05:30 IST