అటవీ సంపదను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2021-03-22T04:54:30+05:30 IST

ప్రతి ఒక్కరూ అడవులను కాపాడుకునేందుకు ముందుకురావాలని డిప్యూటీ రేంజ్‌ అధికారి రేణుక అన్నారు.

అటవీ సంపదను కాపాడుకుందాం
గ్రామస్తులకు మొక్కలను అందజేస్తున్న రేణుక

చారకొండ, మార్చి 21 : ప్రతి ఒక్కరూ అడవులను కాపాడుకునేందుకు ముందుకురావాలని డిప్యూటీ రేంజ్‌ అధికారి రేణుక అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఫారెస్ట్‌లో డిప్యూటీ రేంజ్‌ అధికారి రేణుక ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత  తీసుకోవాలని కోరారు. వణ్య ప్రాణులను రక్షించాలన్నారు. అడవులను అభివృద్ధి చేసి భావిత రాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. చెట్లుంటేనే వర్షాలు సంమృద్ధిగా కురుస్తాయన్నారు. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంద న్నారు. చారకొండ ఫారెస్ట్‌లో 50 ఎకరాల్లో దాదాపుగా 22 వేల మొక్కలను నాటామని ప్రస్థుతం 85 శాతం మొక్కలు బతికాయని తెలిపారు. ఫారెస్ట్‌లో రాక్‌ఫీల్డ్‌, చెక్‌డ్యాంలు, బౌండరి పిల్లర్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. చారకొండ ఫారెస్ట్‌లో అటవీ జీవరాసుల తాగునీటి కోసం గ్రామ పంచాయతీ నుంచి బోరు వేయిస్తానని సర్పంచ్‌ గుండే విజేందర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ రాణిన రేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారి కిరణ్‌కుమార్‌, మాజీ ఎంపీటీసీ ఇదమయ్య, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-22T04:54:30+05:30 IST