ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2021-01-13T04:04:40+05:30 IST
‘ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై అనవస రపు ఆరోపణలు చేస్తే ఊరుకోబోం’ అని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్ హెచ్చరించారు.

- బీజేపీ నాయకులపై మండిపడిన టీఆర్‌ఎస్ నాయకులు
నారాయణపేట టౌన్, జనవరి 12 : ‘ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిపై అనవస రపు ఆరోపణలు చేస్తే ఊరుకోబోం’ అని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్ హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి బీజేపీ నాయకు లకు లేదన్నారు. మీరే నారాయణపేటకు ఓ సమస్యగా మారారన్నారు. టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు స్థాయికి మించి మాట్లాడడం తగదన్నారు. మీ ఉద్యమాలు కేవలం ప్రారంభాని కే పరిమితమయ్యాయన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి నియోజక వర్గంలో ఏ ఒక్క రిపైన అయినా కేసులు నమోదు చేయించారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీపాద్ మాట్లాడుతూ సత్యయా దవ్ ఖబర్దార్, నీవు ముక్కు నేలకు రాసే సమయం ఆసన్నమైందన్నారు. నీవు చేసిన ప్రతి లే అవుట్‌లో కబ్జాభూములే ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడే ఆట మొదలైందని అంటున్నావు కదా ఇక నీ ఆటకు మేమే ముగింపు పలుకుతామ న్నారు. మేము మా ఎమ్మెల్యేతో డిమాండ్ చేస్తున్నాం సత్యయాదవ్ ఆస్తులపై, భూములపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. మా ఎమ్మె ల్యే వ్యాపారాలు చేసుకోవడానికి రాజకీయంలోకి రాలేదని కేవలం ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. నీవెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు ఎలా కూడ బెట్టావని ఆయన ప్రశ్నించారు. మునిసిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్ మాట్లాడుతూ మునిసిపాలిటీని ఎక్కువ రోజులు పాలిం చింది బీజేపీయే కదా ఒక్క అభివృద్ధి పనైనా చేశారాప్రశ్నించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ గట్టు విజయ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కన్న జగదీశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, మాజీ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు గురులింగం, బండి రాజేశ్వరి, శిరీష, జొన్నల అనిత, నారాయణమ్మ, వరలక్ష్మీతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.