మంత్రి మాతృమూర్తికి నాయకుల నివాళి

ABN , First Publish Date - 2021-11-03T05:26:14+05:30 IST

రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి విశ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ మరణంతో ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నా యి.

మంత్రి మాతృమూర్తికి నాయకుల నివాళి
శాంతమ్మ చిత్రపటం వద్ద నివాళ్ళర్పిస్తున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, నవంబరు 2 : రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి విశ్రీనివాస్‌గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ మరణంతో ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నా యి. మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున వచ్చి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్‌రెడ్డి, తాండూర్‌ ఎమ్మెల్యే రోహి త్‌రెడ్డి మంత్రి నివాసంలో శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు. అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఐఏఎస్‌ బూర వెం కటేశం, యాదాద్రి అడిషినల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ భూపాల్‌రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన టీఎన్జీ వో, టీజీఓ నేతలు, అధికారులు శాంతమ్మ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2021-11-03T05:26:14+05:30 IST