కేటీఆర్‌ను కూడా మంత్రి పదవి నుంచి తొలగించాలి
ABN , First Publish Date - 2021-05-06T05:01:30+05:30 IST
మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కూడా తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.

- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ
అమ్రాబాద్, మే 5: మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కూడా తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఈటలకు ఓ న్యాయం, కొడుకుకు ఓ న్యాయమా అని విమర్శించారు. కేటీఆర్ కూడా వందల ఎకరాలు కబ్జా చేశాడని, అతనిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే, కల్ములోనిపల్లిలో క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుంద మల్లిఖార్జున్, బాలింగౌడ్, శ్రీశ్తెలం, ఎంపీటీసీ శ్రీనివాసులు, అంజి తదితరులు ఉన్నారు.