విద్యా సంస్థల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-01-13T03:42:25+05:30 IST
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయని, కొవిడ్ నింబంధనలు పాటిం చాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.

మహబూబ్‌నగర్, కలెక్టరేట్ జనవరి 12: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయని, కొవిడ్ నింబంధనలు పాటిం చాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాసంస్థల్లో తీసుకోవల సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. హెల్త్‌ప్లాన్, శానిటైజ్ ప్లాన్, డైనింగ్ ప్లాన్ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్‌బీఎస్‌కే బృందాలు క్రమం తప్పకుండా తరచూ తనిఖీలు నిర్వహించాలని, వసతి గృహలు కూడా శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలదేనన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ ఉషారాణి, ఇంటర్మీడియట్ విద్యాశాఖా ధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ శాఖాధికారి శంకరాచారి, సోషియల్ వెల్ఫేర్ అధికారి యాదయ్య, డీఎస్‌ఓ వనజాత, పాల్గొన్నారు.
- జిల్లాలో ఈ నెల 16న మొదటి విడత వ్యాక్పినేషన్ ప్రారంభం కానుందని అందుకు సభందించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రా వు సంభందిత శాఖా అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. ఈ నెల 16న మన జిల్లాలోని ఎస్‌వీఎస్ హాస్పిటల్, ప్రభుత్వ జన్రల్ హాస్పిటల్, నేహాషైన్ ప్రైయివేట్ హాస్పిటల్, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
- పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా శాఖలకు నిర్దేశించిన లక్షాలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై వీడియోలు, డాక్యుమెంటరీలు తయా రు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.