కందనూలుకు రెండు శాసన మండలి పదవులు
ABN , First Publish Date - 2021-11-22T04:05:54+05:30 IST
శాసన మండలిలో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మళ్లీ ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కబోతుంది. కల్వకుర్తికి చెందిన కసిరెడ్డి నారాయ ణరెడ్డి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన గొంతుకను తెలంగాణ అంతటా వినిపించిన సాయిచంద్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

కసిరెడ్డి నారాయణరెడ్డికి రెన్యువల్
గాయకుడు సాయిచంద్‌కు పెద్దల సభలో దక్కనున్న గౌరవం
నాగర్‌కర్నూల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి మళ్లీ ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కబోతుంది. కల్వకుర్తికి చెందిన కసిరెడ్డి నారాయ ణరెడ్డి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన గొంతుకను తెలంగాణ అంతటా వినిపించిన సాయిచంద్‌కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాసన మండలి ఎన్నికల నేప థ్యంలో నెల రోజుల నుంచి జిల్లాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలకు మరోసారి అవ కాశం లభి స్తుందని అన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్న క్రమంలో, అనూ హ్యంగా తెలంగాణ గాయకుడు సాయిచంద్ పేరు తెరమీదకు వచ్చింది. సామాజిక సమీకరణలు, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధిష్టానానికి ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడి నట్లు సమాచారం. నాలుగు నియోజక వర్గాలున్న నాగర్‌కర్నూల్ జి ల్లాలో కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్‌లుగా వ్యవహ రిస్తు న్నారు. ఇద్దరూ కేబినెట్ హోదాను పొందుతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే క్రమంలో కచ్చితంగా మళ్లీ ఆ హోదా లభిస్తుందని ఆయన అను చర గణం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది. రెండు రోజులుగా హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమీకరణాలు ఎలా మారుతాయనే అంశంలో ఎవ్వరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. మొత్తంగా శాసన మండలి సభ్యుల ఎన్నిక విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
