కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-02-06T04:11:15+05:30 IST

కల్వకుర్తి అభివృద్ధి కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు.

కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే
మునిసిపల్‌ కార్యాలయం గోదాము నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి టౌన్‌, ఫిబ్రవరి 5: కల్వకుర్తి అభివృద్ధి కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతున్నామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. ము నిసిపల్‌ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శుక్ర వారం శంకుస్థాపనలు చేశారు. మునిసిపల్‌ కార్యాలయం గోదాము ని ర్మాణానికి భూమిపూజ, 1,2,3, వార్డులలో మురు గునీటి ప్రధాన కాలువ నిర్మాణం, 10వ వార్డులో అంతర్గత మురుగు కాలువ నిర్మాణం, 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, చైర్మన్‌ ఎడ్మసత్యం, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ షాహేద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు జనార్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వట్టెపుబాలయ్య, వైస్‌ చైర్మన్‌ సింగం విజయ్‌గౌడ్‌ పాల్గొన్నారు.  Updated Date - 2021-02-06T04:11:15+05:30 IST