రాష్ట్ర స్థాయి పోటీలకు కబడ్డీ జట్టు

ABN , First Publish Date - 2021-03-22T03:47:26+05:30 IST

తెలంగాణ కబడ్డీ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల కోసం జిల్లా జట్లను ఆదివారం ఎంపిక చేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు కబడ్డీ జట్టు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం మార్చి 21: తెలంగాణ కబడ్డీ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల కోసం జిల్లా జట్లను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నిర్వహించిన ఎంపికల్లో 40 మంది పురుషులు, 25 మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో ప్రతిభ కల వారిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కేబీ శ్రీరాములు, సభ్యులు రాంచంద్రయ్య, విజయ్‌కుమార్‌, బాలరాజు, కురుముర్తి గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T03:47:26+05:30 IST