నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-16T04:39:10+05:30 IST

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని యువజన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి డిమాండ్‌ చేశారు.

నిర్వాసితులకు న్యాయం చేయాలి
నిర్వాసితులు చేస్తున్న నిరాహార దీక్షలో మాట్లాడుతున్న శివసేనారెడ్డి

వనపర్తి టౌన్‌, డిసెంబరు 15: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని యువజన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ముంపు గ్రామమైన రేవల్లి మండలం కొంకలపల్లిలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బుధ వారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా శివసేనారెడ్డి మాట్లాడుతూ రైతులకు నీళ్లు ఇచ్చేందుకు తమ సర్వస్వాన్ని కోల్పోతున్న వారికి ప్రభుత్వం సరైన సమయంలో న్యాయం చేయ డం లేదని, ప్రాజెక్టు పూర్తయినా నేటికీ పూర్తిస్థా యిలో పరిహారం అందించకుండా జ్యాప్యం చే స్తుందని అన్నారు. ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజికి 2016 కట్‌ఆఫ్‌ తేదీ ఇచ్చారని అన్నారు. దానిని 2018కి పొడగించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈఎస్‌ సర్వేలో తప్పిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని, 70 సంవత్సరాల పై బడిన వారికి కొంకలపల్లి గ్రామంలో ఖాళీ ప్లాట్ల పరిహారం అందజేయాలని కోరారు. 18 సంవత్సరాలు నిండి న వారికి పూర్తి స్థాయి ప్యాకేజి అందజేయాలని కోరారు. నిర్వాసితులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మాజీ ఎమ్మెల్యే జయరాములు విగ్రహం ఏర్పాటు చేయాలి 

బడుగు, బలహీన వర్గాల ఎమ్మెల్యేగా, నిరాడం భరంగా జీవితం గడిపిన మాజీ ఎమ్మెల్యే జయ రాములు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని   కొత్తకాపు శివసేనారెడ్డి డిమాండ్‌ చే శారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో  జయరాములు సమాధిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సం దర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ నియోజ కవర్గ ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు జయరాములు చేసిన సేవలను కొనియాడారు.  జయరాములు మరణించి 35 సంవత్సరాలు అవుతున్నా ఆయన గడిపిన జీవితంలాగే  సమా ధి కూడా సాదాసీదగా ఉందని అన్నారు. జయరా ములు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వెడల్పులో ఆయన సమాధికి ఎలాంటి విఘాతం కలుగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్‌ సతీష్‌ యాదవ్‌, యువజన నాయకుడు పాండు సాగర్‌ ఉమ్మల రాములు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-16T04:39:10+05:30 IST