తెలంగాణ కోసం తపించిన జయశంకర్‌

ABN , First Publish Date - 2021-06-22T04:42:16+05:30 IST

తెలంగాణ ఏర్పటుతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పరితపించిన మహోన్నతుడు జయశంకర్‌ సార్‌ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకులు ఆర్‌.రవిప్రకాష్‌ అన్నారు.

తెలంగాణ కోసం తపించిన జయశంకర్‌
జయశంకర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ నాయకులు

 పాలమూరు, జూన్‌ 21: తెలంగాణ ఏర్పటుతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పరితపించిన మహోన్నతుడు జయశంకర్‌ సార్‌ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకులు ఆర్‌.రవిప్రకాష్‌ అన్నారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి సోమవారం పూలమాలవేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి, ప్రజలను ఉద్యమానికి సిద్ధం చేసిన మహోన్నతుడు జయశంకర్‌ అని కొనియాడారు.

మహబూబ్‌నగర్‌ టౌన్‌: జయశంకర్‌ వర్ధంతి వేడుకలను కలెక్టర్‌ బంగ్లా సమీపంలోని మోనప్పగుట్ట ప్రాంతంలో గల ఆచార్య జయశంకర్‌ విశ్వకర్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య ఇంట్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో అంజయ్య, భగవంత్‌, వేణుగోపాల్‌, భిక్షపతి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:42:16+05:30 IST