ప్రతీ ఎకరాకు సాగునీరు

ABN , First Publish Date - 2021-10-21T05:50:51+05:30 IST

నియోజకవర్గంలో సాగునీరు అందక బీడువడిన ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్‌ రెడ్డి అన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు
మినీ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి, అక్టోబరు 20: నియోజకవర్గంలో సాగునీరు అందక బీడువడిన ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ న్‌ రెడ్డి అన్నారు. మోజర్ల గ్రామ శివారులో 650 ఎక రాలకు సాగునీరు అందించేందుకు మోజర్ల - శారగట్టు ఎత్తిపోతల పథకానికి  బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించి సస్యశ్యామలం చేయడమే తన లక్ష్య మని అన్నారు.   రైతుల అభివృద్ది చెందినప్పుడే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన అన్నారు. రైతుల కోసం ప్రైవేట్‌ కార్పోరేట్‌ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.  రూ. 1.75 కోట్లతో చేపట్టే మోజర్ల - శారగట్టు ఎత్తిపోతల పథకానికి అరబిందో ఫార్మా వారు రూ. 1.5 కోట్లు, రాంకీ సంస్థ రూ. 25లక్షలు సహకారంతో పనులు చేపడుతున్న ట్లు ఆయన తెలిపారు. రైతులు సహకరిస్తే 45 రోజు ల్లో పనులు పూర్తి చేసి సకాలంలో సాగునీరు అంది స్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచ్‌ సునిత, జిల్లా రైతు సమితి అధ్యక్షుడు జగదీఽశ్వర్‌రెడ్డి, మండల రైతు సమితి అ ధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ విష్ణు వర్ధన్‌రెడ్డి,  అరబిందో ఫార్మసీ, రాంకీ కంపెనీల డైరెక్టర్లు నిత్యానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, సదానంద రెడ్డి, రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేణు యాదవ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రాములుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

విశ్వమానవుడికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి : మంత్రి

వనపర్తి రూరల్‌, అక్టోబరు 20: విశ్వమానవుడికి సన్మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప ట్టణంలోని నాగవరం సమీపంలో బుధవారం వా ల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ప్రతీ ఒక్కరి లో మార్పు రావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, కౌన్సిలర్‌లు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, నాగవరం సింగిల్‌విండో సొసైటీ అధ్యక్షుడు మధు సూదన్‌రెడ్డి, రాజనగరం సింగిల్‌విండో సొసైటీ అధ్యక్షుడు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:50:51+05:30 IST