గట్టు ఎత్తిపోతల స్థల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-09T04:10:52+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో ని గట్టు ఎత్తిపోతల పథకం నిర్మించే స్థలాన్ని సోమవారం తెలంగాణ ఎ త్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి సందర్శించారు.

గట్టు ఎత్తిపోతల స్థల పరిశీలన
గట్టు ఎత్తిపోతల పథకం మ్యాప్‌ను పరిశీలిస్తున్న పెంటారెడ్డి

(గద్వాల-ఆంధ్రజ్యోతి)/గట్టు, ఫిబ్రవరి 8 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ని గట్టు ఎత్తిపోతల పథకం నిర్మించే స్థలాన్ని సోమవారం తెలంగాణ ఎ త్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి సందర్శించారు. గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి మండలంలోని ఆలూరు, రాయాపూర్‌ శివారు ప్రాంతాలను ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మ్యాప్‌తో పాటు నిర్మాణ స్వరూపాన్ని ఇరిగేషన్‌ శాఖ సీఈ రఘునాథ్‌, ఎ స్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ రహీముద్దీన్‌లు వివరించారు. అనంతరం పెంటారె డ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిజైన్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం టెం డర్లు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆయన వెంట డీ ఈ ప్రవీణ్‌, ఏఈ ఉపేందర్‌, ఎంపీపీ విజయ్‌ ఉన్నారు.

Updated Date - 2021-02-09T04:10:52+05:30 IST