ధాన్యం తూకంలో అక్రమాలు

ABN , First Publish Date - 2021-05-20T05:45:48+05:30 IST

కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జరుగుతున్న అవకత వకలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ధాన్యం తూకంలో అక్రమాలు
నాయకులతో మాట్లాడుతున్న అధికారులు

- కొనుగోలు కేంద్రంపై ఫిర్యాదు  చేసిన రైతులు

- అవకతవకలపై విచారణ జరిపిన అధికారులు


దామరగిద్ద, మే 19 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జరుగుతున్న అవకత వకలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మహబూబ్‌నగర్‌ లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ రాంమోహన్‌ బుధవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తూకాన్ని పరిశీలించగా తేడాలున్నట్లు గుర్తించారు. దీంతో కొనుగోళ్లు నిలిపి వేయాలని ఆదేశించారు. అయితే, అప్పటికే క్యూలో ఉన్న రైతులు తమ ధాన్యం తూ కాలు అయిపోయాక కొనుగోళ్లు నిలిపి వేయాలని అధికారిని కోరారు. దీంతో క్యూలో ఉ న్న రైతుల ధాన్యం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు. అనంతరం కొత్త వారి ధాన్యం తీసు కోరాదని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట నారాయణపేట మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌ బస్కర కుమారి, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-05-20T05:45:48+05:30 IST