గంజాయి, గుడుంబాపై ఉక్కుపాదం మోపాలి

ABN , First Publish Date - 2021-11-03T05:15:46+05:30 IST

జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదా ర్థాలు తయారు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు.

గంజాయి, గుడుంబాపై ఉక్కుపాదం మోపాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

- అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేయండి

- దుష్పరిణామాలపై అవగాహన కల్పించండి  

-  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) :    జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదా ర్థాలు తయారు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ ఆదేశించారు. మత్తు ప దార్థాల కట్టుదిట్టమైన నియంత్రణకు మంగళవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎస్పీ డాక్టర్‌ వై. సాయిశేఖర్‌, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి లైన్‌ డిపార్ట్‌మెంట్‌లతో సమన్వయ సమావే శాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గుడుంబా తయారీ, గంజా యి, గుడుంబా, గుట్కా, ఇతర చట్ట వ్యతిరేక మత్తు పానీయాల తయారీని ఉక్కుపాదంతో అణ చివేసే విధంగా అన్ని లైన్‌ డి పార్ట్‌మెంట్‌లు కలిసి పని చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో వ్యవ సాయ విస్తీర్ణాధికారులకు తెలియ కుండా గంజా యి సాగు ఎలా అవుతుందా అని వ్యవసాయ అధి కారిని ప్రశ్నించారు. అదేవిధంగా గుడుంబా తయా రీ విషయంలో పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నా రని ప్రశ్నించారు. ఎక్కడైనా గంజాయి సాగు జరిగి నట్లు తెలిస్తే వారిని అరెస్టు చేసి బైండోవర్‌ కేసులు పెట్టాలని, అవసరమైతే పీడీ యాక్టు పెట్టాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారిని, పంచాయతీ సెక్రటరీని వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాలు తయారు చేయకుండా వాటి దుష్పరిణామాలపై కళాజాత బృందాల ద్వారా ప్రచారం కల్పించాలని జిల్లా పౌరసంబంధాల అధికారిని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ 15రోజులకు జిల్లాస్థాయి సమ న్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.   ఎస్పీ డాక్టర్‌ వై.సాయిశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భు త్వం గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో  మత్తు పదార్థాలు తయారు చేసే వారు లేదా ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమావేశం లో డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్‌ యాసిన్‌ ఖురేషి, అ దనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌ సూపరిటెం డెంట్‌ దత్తురాజు గౌడ్‌, వ్యవసాయ అధికారి వెం కటేశ్వర్లు, డీపీవో రాజేశ్వరి, ఆర్డీవోలు  , డీఎస్పీలు,  సీఐలు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-03T05:15:46+05:30 IST