ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-26T05:06:43+05:30 IST

లాక్‌డౌన్‌ కారణం గా వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం (2020-21) పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం
గద్వాలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఆర్డీవో రాములు

- తొలిరోజు పరీక్షకు 440 మంది గైర్హాజరు 
- విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశాకే కేంద్రంలోకి అనుమతి

గద్వాల టౌన్‌, అక్టోబరు 25 : లాక్‌డౌన్‌ కారణం గా వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం (2020-21) పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 16 కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు 440 మంది విద్యార్థులు గైర్హాజ రయ్యారు. జిల్లా వ్యాప్తంగా 4,303 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 3,863 మంది  హాజ రయ్యారు. వారిలో 3,375 మంది జనరల్‌, 488 మంది వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన వారు ఉన్నారు. గద్వాల పట్టణంలోని ఏడు పరీక్ష కేంద్రా ల్లో 1,466 మంది జనరల్‌, 323 మంది వృత్తి విద్య, మొత్తంగా 1,789 మంది పరీక్ష రాశారు. మరో 153 మంది గైర్హాజరయ్యారు. అయిజ జోన్‌లోని నాలుగు కేంద్రాల్లో 936 మంది హాజరుకాగా, 135 మంది గైర్హాజరయ్యారు. ధరూరు, అలంపూరు, గట్టు, మానోపాడు, మల్దకల్‌ కేంద్రాల్లో 1,138 మంది పరీక్ష రాయగా, 152 మంది గైర్హాజరయ్యారు. 

పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. అత్యవ సర వైద్య సేవల అవసరమైతే వినియోగించుకు నేందుకు కేంద్రాల వద్ద ఆశ, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియల్‌ జిల్లా నోడల్‌ అధికారి ఎం.హృదయరాజు తెలిపారు. గద్వా ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని ఆర్డీవో రాములు తనిఖీ చేశారు. Updated Date - 2021-10-26T05:06:43+05:30 IST