17న అచ్చంపేటలో కాంగ్రెస్‌ దీక్ష

ABN , First Publish Date - 2021-01-13T04:13:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17న అచ్చంపేటలో దీక్ష చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు.

17న అచ్చంపేటలో కాంగ్రెస్‌ దీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ

 - డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ

లింగాల, జనవరి12: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల పై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17న అచ్చంపేటలో  దీక్ష చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త వ్యవసాయ చ ట్టాలను రద్దు చేయాలని ఢీల్లీలో చేస్తున్న ఆందోళనపై కేంద్రం ఏ మాత్రం స్పం దించకపోవడం చూస్తుంటే రైతులపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతుంద న్నారు. కొత్త చట్టాలను ఉపసంహరించే వరకు రైతులకు బాసటగా కాంగ్రెస్‌ ని లుస్తోందన్నారు. దీక్షకు కాంగ్రెస్‌  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మల్లు రవి, నాగం జనార్థన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి బోసు రాజు, వంశీ చందర్‌, సంపత్‌కుమార్‌ హాజరవుతాయన్నారు.  అంతకు ముందు మండల కేం ద్రానికి చెందిన ముస్లిం నాయకులు ఖుద్దూస్‌ అనారోగ్యంతో మృతి చెందగా ఆ యన కుటుంబాన్ని వంశీకృష్ణ, ఎంపీపీ పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ, మాజీ వైస్‌ ఎంపీపీ కిషన్‌నాయక్‌, నాయకులు కృష్ణయ్య, వెంకట య్యగౌడ్‌, నిరంజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T04:13:26+05:30 IST