ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-11-01T04:11:36+05:30 IST

మాజీ ప్రధాని, భారతరత్న గ్రహిత ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం
మరికల్‌లో ఇందిరా గాంఽధీ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట, అక్టోబరు 31 : మాజీ ప్రధాని, భారతరత్న గ్రహిత ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మొదటి మహిళా ప్రధానిగా దేశానికి ఇందిర చేసిన సేవలను కొనియాడారు. గరిబీ హఠాఓ అనే నినాదంతో పేదలకు సంక్షేమ ఫలాలను అందించారన్నారు. బ్యాంకులను జాతీయం చేయడంతో పాటు జమిందారి వ్యవస్థను రద్దు చేసి వెట్టి చాకిరీ ని ర్మూలనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అ సంఘటిత కార్మిక కాంగ్రెస్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి లిఖి రఘుబాబు, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు మహిమూద్‌ ఖురేషి, రేవంత్‌ సైన్యం అధ్యక్షుడు యూసూఫ్‌ తాజ్‌, కాంగ్రెస్‌ నాయకులు జనార్దన్‌, సీతారాం, నరేష్‌, హనీఫ్‌ పాల్గొన్నారు.

ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడలో ఆదివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వ ర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జట్రం లక్ష్మయ్యగౌడ్‌, బోయ బాల్‌రాజు, జుట్ల ఆనంద్‌గౌడ్‌, నరేందర్‌, రాఘవేందర్‌రెడ్డి, వెంకటాపూర్‌ రాము, ఖదీర్‌, జట్రం రాజేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : మాజీ ప్రధాని దివంగత ఇంది రాగాంఽధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం మండలం కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరా గాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఇందిరా గాంఽధీ ఆశయాలను కొనసాగించాలన్నా రు. కార్యక్రమంలో వీరన్న, హన్మంతు లంకరి శ్రీను, మల్లేష్‌, మాసన్న పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-01T04:11:36+05:30 IST