అక్రమ వెంచర్లపై నిగ్గు తేల్చాలి
ABN , First Publish Date - 2021-05-06T05:00:23+05:30 IST
కల్వకుర్తి మునిసిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై యుద్ధ ప్రాతిపదికన నిగ్గు తేల్చేందుకు జిల్లా కలెక్టర్ చ ర్యలు చేపట్టాలని, అందుకు రెవెన్యూ, మునిసిపల్ అధికా రుల అక్రమాలను వెలికి తీయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు.

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్
కల్వకుర్తి టౌన్, మే 5: కల్వకుర్తి మునిసిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై యుద్ధ ప్రాతిపదికన నిగ్గు తేల్చేందుకు జిల్లా కలెక్టర్ చ ర్యలు చేపట్టాలని, అందుకు రెవెన్యూ, మునిసిపల్ అధికా రుల అక్రమాలను వెలికి తీయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. కల్వ కుర్తిలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపల్ పరిధిలోని వెంచర్లలో కొనసాగుతున్న అవినీ తి, అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో బుధవారం పొ లం కావాలా..ప్రాణం కావాలా అనే శీర్షిక తో కథనం వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులు స్పందించారు. కల్వకుర్తి మునిసిపల్ పరిధిలో గత కొద్ది ఏళ్లుగా ఏర్పాటు చేసిన వెంచర్లు 70కి పైగా ఉన్నప్పటికీ 10కి మించి నిబంధనల ప్రకారం వెంచర్లు చేయలేదంటే అవినీతి ఈ ప్రాంతంలో ఎంతగా కొనసా గుతుందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కోర్టు కేసులో ఉన్న భూ ములను సైతం ఆక్రమించుకునేందుకు లబ్ధిదారులను చంపుతామని బెదిరింపు లకు పాల్పడటం ఏంటని ఆయన ప్రశ్నించా రు. దీంతో పాటు హైదరాబాద్ చౌరస్తా నుంచి దేవరకొండ వెళ్లే దారిలో హరిహరటౌన్ షిప్ పక్కనే మిషన్ భగీరఽథ ప్రధాన పైప్ లైన్ ఉన్న ప్రాంతంలో వెం చర్ ఏర్పాటు చేయడం ఏంట ని, అధికారులు వారికి ఏ విధంగా అనుమతులు ఇస్తు న్నారని విమర్శించారు. వెం చర్ అనంతరం ఇళ్ల నిర్మాణం చేపట్టాకా పైప్‌లైన్ లీక్ అ యితే వెంచర్‌తో సహా కాలనీ మొత్తం నీటితో మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. వెంచర్ పక్కనే సమాదులు సైతం ఉన్నాయని, వాటిలో కొన్ని ఇప్పటికే ఉన్న స్థలం నుంచి పక్కకు జరుపడం జరిగిందని తెలిపారు. కల్వకుర్తిలో కొనసాగుతున్న అవినీతి వెంచర్లపై, అధికార పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న స్వాహాల గురించి తక్షణమే కలెక్టర్ స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలతో ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ మో ర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకొల్లు రవి,గౌడ్, పట్టణ అధ్యక్షులు నర్సింహ్మ, మాజీ అధ్యక్షులు కుడుముల రాంరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.