పది రోజుల్లో పూర్తి చేయకపోతే చర్యలు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-06-22T04:43:57+05:30 IST

గ్రామాల్లో అసంపూర్తి పనులను పది రోజుల్లో పూర్తిచేయక పోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హరిచందన హెచ్చరించారు.

పది రోజుల్లో పూర్తి చేయకపోతే చర్యలు: కలెక్టర్‌
బొమ్మన్‌పాడు గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

 నారాయణపేట రూరల్‌, జూన్‌ 21: గ్రామాల్లో అసంపూర్తి పనులను పది రోజుల్లో పూర్తిచేయక పోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హరిచందన హెచ్చరించారు. మండలంలోని బొమ్మన్‌పాడ్‌ గ్రామాన్ని కలెక్టర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలకు రహదారిని, ప్రహరీని ఏర్పాటు చేయాలన్నారు. పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలకు రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో చెత్తను సేకరిస్తున్నారా? అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌-19 వివరాలను ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ప్రత్యేక అధికారి జైపాల్‌రెడ్డి, ఎంపీడీవో సందీప్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, వైస్‌ఎంపీపీ సుగుణ, భగవంతు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:43:57+05:30 IST