పట్టణంలో హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారి

ABN , First Publish Date - 2021-05-19T05:21:56+05:30 IST

పట్టణంలో వివిధ వార్డుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశా రు. మునిసిపల్‌లోని 23వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చైర్‌పర్సన్‌ దోరేపలి లక్ష్మీరవీందర్‌ పిచికారి చేశారు.

పట్టణంలో హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారి

బాదేపల్లి, మూ 18 : పట్టణంలో వివిధ వార్డుల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశా రు. మునిసిపల్‌లోని 23వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చైర్‌పర్సన్‌ దోరేపలి లక్ష్మీరవీందర్‌ పిచికారి చేశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ పట్టణంలో కరోనా వైరస్‌ విసృతంగా విస్తరిస్తుందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కోరారు. అత్యవస రమైతేనే బయటికి రావాలని కోరారు. 7వ వార్డులో కౌన్సిలర్‌ ఉమాదేవివెంకటేష్‌ హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్‌గౌడ్‌, చైతన్య, నాయకులు సందీప్‌గౌడ్‌, సుభాష్‌, రవిగౌడ్‌, నరేష్‌, జగదీశ్వర్‌రెడ్డి, రషీద్‌, బాల నర్సింహ, రాజీవ్‌గౌడ్‌, కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ వెంకటేష్‌, నాయకులు నర్సింహులు, కరుణాకర్‌, నర్సిరెడ్డి, రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T05:21:56+05:30 IST