తండాల అభివృద్ధే.. ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-30T04:18:27+05:30 IST
తండాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖా మంత్రి నిరంజ న్‌రెడ్డి అన్నారు.

గోపాల్‌పేట, అక్టోబరు 29 :తండాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖా మంత్రి నిరంజ న్‌రెడ్డి అన్నారు. మండలంలోని బుద్దారం ధర్మతండా కు ఎస్టీఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన బీటీ రోడ్డు ను మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన గిరిజన తండాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు తండాలవైపు కన్నెత్తి కూడా చూడ లేదన్నారు. సరైన రోడ్డు నిర్మాణాలు లేక గిరిజనులు ఇబ్బంది పడేవారని. అత్యవసర పరిస్తితుల్లో కనీసం మండల కేంద్రానికి రావాలన్న ఎంతో ఇబ్బంది పడే వారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ తండా కు బీటీరోడ్డు నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమ న్నారు. ముఖ్యంగా మండలంలో అర్హులందరికీ డ బుల్‌బెడ్ రూం ఇల్లు త్వరలో మంజూరు చేస్తామ ని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమ లు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల మరణించిన రైతు రాములు కుటుంబానికి రూతుబీమా ప్రొసిడిం గ్‌ను రాములు భార్యకు అందజేశారు. కార్యక్ర మం లో సర్పంచ్‌లు పద్మమ్మ, శ్రీనివాసులు, శేఖర్ యాద వ్, శంకర్‌నాయక్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు హర్యనా యక్, నాయకులు కోటీశ్వర్‌రెడ్డి, బిల్లకంటిరాజు, విష్ణు, వెంకటయ్య, తోళ్లరవి, గిరిజనులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ పార్టీ రేవల్లి మండల నాయకులు శుక్రవారం జడ్పీటీసీ భీమయ్య ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి నిరంజన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.