ఘనంగా తీజ్‌ ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-08-26T04:09:08+05:30 IST

మండలంలోని చిట్లంకుంట గ్రామంలో బంజారా గిరిజనులు బుధవారం ఘనంగా తీజ్‌ ఉత్సవాలు నిర్వహించారు.

ఘనంగా తీజ్‌ ఉత్సవాలు
తీజ్‌ ఉత్సవాలలో పాల్గొన్న మహిళలు

పదర, ఆగస్టు 25: మండలంలోని చిట్లంకుంట గ్రామంలో బంజారా గిరిజనులు బుధవారం ఘనంగా తీజ్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది భక్తిశ్రద్ధలతో గృహాలంకరణ చేపట్టి 9రోజుల క్రితం వేసిన మొలకలను ప్రత్యేక పూజలతో తలపై ఉంచి గ్రామ పురవీధుల్లో కుటుంబ సమేతంగా తిరిగారు. గ్రామ సర్పంచ్‌ నీల, ప్రజలు హన్మం తు, ఆంజనేయులు, చందు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-26T04:09:08+05:30 IST