కంకర వేశారు...తారు మరిచారు

ABN , First Publish Date - 2021-03-25T04:18:56+05:30 IST

రోడ్డు నిర్మాణం భాగంగా కంకర వేసి తారు వేయడంతో మరిచారు.

కంకర వేశారు...తారు మరిచారు
కంకర వేసి తారు వేయకుండా వదిలేసిన రోడ్డు

- ఇబ్బంది పడుతున్న వాహనదారులు 

పెద్దమందడి, మార్చి 24: రోడ్డు నిర్మాణం భాగంగా కంకర వేసి తారు వేయడంతో మరిచారు.  మండల పరిధిలోని చిన్నమందడి క్రాస్‌ రోడ్డు నుంచి దొడగుంటపల్లి గ్రామం మీదుగా పెద్దమందడి వరకు 5.6కి.మీ తారు రోడ్డు నిర్మాణం కోసం రూ. 2.84 కోట్లతో పనులు ప్రారంభించారు. చిన్నమందడి క్రాస్‌ రోడ్డు నుంచి దొడగుంటపల్లి వరకు తారు రోడ్డు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి  పెద్దమందడి వరకు చేపట్టాల్సిన తారు రోడ్డు నిర్మాణం భాగంగా కంకర వేసి రెండు నెలలు గడుస్తున్నా తారు వేయడంలో గుత్తేదార్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకర రోడ్డుపై తీవ్ర ఇబ్బంది పడుతున్నామని  ద్విచక్ర వాహనాదారులు వాపోతున్నారు. పాలకులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై పీఆర్‌ఏఈ భాస్కర్‌ను వివరణ కోరగా దొడగుంటపల్లి నుంచి పెద్దమందడి వరకు రోడ్డు పనులు నిలిచిపోయాయి. రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తాం. అంతవరకు వాహనదారులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. 

  

Updated Date - 2021-03-25T04:18:56+05:30 IST