పట్టభద్రుల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-03-02T05:20:26+05:30 IST

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ని యోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని బీఎల్‌వోలను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశిం చారు.

పట్టభద్రుల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- బూత్‌స్థాయి అధికారులకు అవగాహన

వనపర్తి అర్బన్‌, మార్చి 1: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ని యోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని బీఎల్‌వోలను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశిం చారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో బూత్‌స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈనెల 7లోగా ఓట ర్‌ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని, అనంతరం వివరాలను  కలెక్టరేట్‌లో సమర్పించాలని బీఎల్‌వో లకు సూచించారు. వనపర్తి జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు పురుషులు 14355, స్త్రీలు 6802మం ది, ట్రా న్స్‌జెండర్‌ ఒకటి, మొత్తం ఓటర్ల సంఖ్య 21158 మంది నమోదు అయినట్లు కలెక్టర్‌ వివరించారు. అంతేకాక ఎన్నికలు నిర్వహించేందుకు 31 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని బీఎల్‌వోలకు సూచించారు. కొవిడ్‌ ని బంధనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీవో అమరేందర్‌, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రమేశ్‌రెడ్డి, బీఎల్‌వోలు  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:20:26+05:30 IST