ప్రజల విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వాలు
ABN , First Publish Date - 2021-10-21T04:59:26+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల విశ్వాసం కోల్పోతున్నారని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.

- సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
ఉండవల్లి, అక్టోబరు 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల విశ్వాసం కోల్పోతున్నారని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఉండవల్లి మండల పరిధిలోని కంచుపాడులోని తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టా రు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం నవాబు వలే వ్య వహరిస్తూ, అమలు కానీ హామీలను గుప్పిస్తున్నార ని అన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అణగదొక్కుతు న్నారని అన్నారు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్ నోటికి వచ్చినట్లు దురుసుగా మాట్లడుతున్నారని అ న్నారు. వీరి బాటలోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడా నడుస్తున్నారని అన్నారు. అమలు కానీ పథకాలను హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతు న్నారని విమర్శించారు. ఇంటికి పది లక్షలు, మనిషికి పది లక్షలు అంటూ ప్రచారాలు ఎందుకని కోటీ రూపాలయాలతో చి న్నపాటి పరిశ్రమను స్థాపించి అందులో కొంతమంది నిరుద్యో గులకు ఉపాధి క ల్పించి, తయారు అ య్యే ఉత్పత్తులను మంచి మార్కెటింగ్ క ల్పించి, వారికి రుణా లు, సబ్సిడీలు అం దించి ప్రోత్సహించాల న్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ప థకాల అమలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీఆర్ వోలను, ఫీల్డ్ అసిస్టెంట్‌లను ఉద్యోగాల నుంచి తొల గించి వారిని మరింత పేదరికంలో నెట్టారని అన్నా రు.గ్రామాలలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి చివరకు వీధి లైట్లను కూడా కాంట్రాక్టర్ చేతిలో పె ట్టారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతూ రైతులకు ఇష్టం లేక పోయిన బలవంతంగా రైతు వ్యతిరేఖ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సీబీ ఐ, ఎన్‌ఫోర్స్ మెంట్, ఇన్‌కం ట్యాక్సీ వంటి అధికా రు లను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ చ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటీయూసీ జాతీ య కార్యదర్శి విజయలక్ష్మి, సీపీఐ డిజిటల్ కో ఆర్డినే టర్ సురవరం కపిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహా, నాయకుడు ఫయాజ్ పాల్గొన్నారు.